Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వేపై అధికార యంత్రాంగం దృష్టి


సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వేపై అధికార యంత్రాంగం దృష్టి


సాంబ చెన్నంశెట్టి సమగ్ర నివేదిక, హరి చెన్నంశెట్టి వినతిపత్రం అనంతరం క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ పరిశీలన


సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారి-16పై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) వద్ద వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజుతో కలిసి ప్రమాదాలకు గురవుతున్న ELF రన్‌వే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. పరిశీలన సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, డీటీసీ సుశీల్, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, కనుమళ్ల గ్రామం మరియు సింగరాయకొండ మధ్య ప్రజలు నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు, నిత్యావసర అవసరాల కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ఈ రహదారిని దాటాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.


ELF రన్‌వే కావడంతో అండర్‌పాస్ నిర్మాణం వంటి కొన్ని పరిష్కారాలకు సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ పరిష్కారాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న కొన్ని అండర్‌పాస్‌లను పునరుద్ధరించడం, ఆమోదం పొందిన సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, శాశ్వత పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక రహదారి సదుపాయాలు కల్పించడం, ప్రమాద ప్రాంతానికి ఇరువైపులా అలర్ట్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


అలాగే వాహనాల వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, రహదారి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే నేషనల్ హైవే అధికారులకు సూచనలు ఇచ్చినట్లు, త్వరలోనే క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


గత కొంతకాలంగా ELF రన్‌వేపై జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుడు సాంబ చెన్నంశెట్టి 2019 నుంచి 2026 వరకు జరిగిన ప్రమాదాలు, మరణాలు, గాయాలు, భద్రతా లోపాలు, ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల అభిప్రాయాలు, అధికారుల పరిశీలనలు తదితర అంశాలతో కూడిన 40 పేజీల సమగ్ర నివేదికను సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వైమానిక దళ అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ, జిల్లా యంత్రాంగం సహా 21 మంది కీలక అధికారులకు పంపించారు.


అదే విధంగా హరి చెన్నంశెట్టి కూడా జిల్లా కలెక్టర్‌కు నేరుగా వినతిపత్రం అందజేసి ELF రన్‌వేపై జరుగుతున్న ప్రమాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి తరుపున వచ్చిన విజ్ఞప్తులు, నివేదికలు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించడంతోనే ఈ స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించబడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


ఇటీవల వరకు ప్రమాదాలకు నిలయంగా మారిన ELF రన్‌వే ప్రాంతంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్‌హెచ్‌ఏఐ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలన నిర్వహించడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇకనైనా అధికారులు ప్రకటించిన చర్యలు వేగంగా అమలై, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా శాశ్వత పరిష్కారం లభించాలని సింగరాయకొండ ప్రజలు కోరుతున్నారు.

సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రమాదాలపై హరి చెన్నంశెట్టి కలెక్టర్‌కు వినతి

సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రమాదాలపై హరి చెన్నంశెట్టి కలెక్టర్‌కు వినతి


ఒంగోలు: సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) పరిసర ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరాయకొండకు చెందిన హరి చెన్నంశెట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారిని కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా ప్రమాదాల వివరాలు, ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘటనలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి భద్రత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


వినతిపత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సింగరాయకొండ ELF రన్‌వేపై 40 పేజీల సమగ్ర నివేదికను 21 మంది ఉన్నతాధికారులకు పంపించిన సాంబ చెన్నంశెట్టి

సింగరాయకొండ ELF రన్‌వేపై 40 పేజీల సమగ్ర నివేదికను 21 మంది ఉన్నతాధికారులకు పంపించిన సాంబ చెన్నంశెట్టి


సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలు, భద్రతా లోపాలపై రూపొందించిన 40 పేజీల సమగ్ర నివేదికను సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుడు సాంబ చెన్నంశెట్టి 21 మంది ఉన్నతాధికారులకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు.


ముద్రణ, కవర్లు, పోస్టల్ ఛార్జీలు తదితర ఖర్చులతో కలిపి ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమానికి సుమారు రూ.9,000 వరకు వ్యయం అయినట్లు తెలిపారు.


నివేదిక పంపిన అధికారులు, వారి స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ నంబర్లు:


1. Nitin Jairam Gadkari – EN518205670IN


2. Air Chief Marshal A. P. Singh – EN518205635IN


3. Air Officer Commanding-in-Chief, Southern Air Command – EN518205958IN


4. N. Chandrababu Naidu – EN518205887IN


5. Pawan Kalyan – EN518205860IN


6. B. C. Janardhan Reddy – EN518205873IN


7. Santosh Kumar Yadav (Chairman, NHAI) – EN518205723IN


8. Regional Officer, NHAI Andhra Pradesh – EN518205754IN


9. Project Director, NHAI PIU Ongole – EN518205799IN


10. P. Raja Babu, IAS (District Collector) – EN518205785IN


11. Harshavardhan Raju, IPS (SP Prakasam) – EN518205710IN


12. Harish Kumar Gupta, IPS (DGP AP) – EN518205745IN


13. Magunta Sreenivasulu Reddy, MP – EN518205842IN


14. Dr. Dola Sree Bala Veeranjaneya Swamy, MLA – EN518205771IN


15. DIG, South Coastal Zone – EN518205808IN


16. Circle Inspector, Singarayakonda – EN518205811IN


17. Station House Officer, Singarayakonda – EN518205768IN


18. MPDO, Singarayakonda – EN518205825IN


19. Tahsildar, Singarayakonda – EN518205839IN


20. Principal Secretary, Transport, Roads & Buildings – EN518205913IN


21. Chief Minister’s Grievance Redressal System – EN518205927IN


సంబంధిత శాఖలు స్పందించి సింగరాయకొండ ELF రన్‌వేపై భద్రతా చర్యలు చేపట్టి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వే పై 40 పేజీల సమగ్ర నివేదిక రూపొందించిన సింగరాయకొండ సామాజిక కార్యకర్త సాంబ చెన్నంశెట్టి

సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్‌వే పై 40 పేజీల సమగ్ర నివేదిక రూపొందించిన సింగరాయకొండ సామాజిక కార్యకర్త సాంబ చెన్నంశెట్టి


సింగరాయకొండ మండల పరిధిలోని జాతీయ రహదారి-16పై ఉన్న అత్యవసర విమానాల ల్యాండింగ్ సదుపాయం (ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ - ELF) వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలు, ప్రజల ఆందోళనల నేపథ్యంలో సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుడు (Public Interest Petitioner) సాంబ చెన్నంశెట్టి 40 పేజీల సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.


2019 నుంచి 2026 జూన్ వరకు అందుబాటులో ఉన్న పత్రికా కథనాలు, ప్రమాద గణాంకాలు, ఫొటోలు, పోలీసు అధికారుల పరిశీలనలు, ప్రజల అభిప్రాయాలు, ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అధికారులకు వినతిపత్రాలు తదితర అంశాలతో కూడిన ఈ నివేదికను రూపొందించారు.


ఈ నివేదికలో 92 మంది మృతిచెందినట్లు, 127 మంది గాయపడినట్లు ప్రచురిత గణాంకాల ఆధారంగా ప్రస్తావించబడింది. రన్‌వే ప్రాంతంలో నిరంతర డివైడర్ లేకపోవడం, సరైన లైటింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డుల కొరత, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌ల లేమి, వాహనదారుల నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.


ప్రమాదాల నియంత్రణ కోసం నిరంతర డివైడర్ ఏర్పాటు, లైటింగ్, బ్లింకింగ్ సిగ్నల్స్, హెచ్చరిక బోర్డులు, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు, రహదారి భద్రతా ఆడిట్ నిర్వహణ వంటి పలు సూచనలు ఈ నివేదికలో పొందుపరిచారు.


ఈ నివేదిక ప్రతులను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, దక్షిణ వైమానిక దళ కమాండ్ ఎయిర్ మార్షల్ మనీష్ ఖన్నా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, NHAI ‌ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు, NHAI ఒంగోలు ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ డీఐజీ, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సింగరాయకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్(SI), సింగరాయకొండ తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, రవాణా, రోడ్లు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితర అధికారులకు పంపనున్నట్లు సాంబ చెన్నంశెట్టి తెలిపారు.


ప్రాణ నష్టాలను నివారించడం, ప్రజల భద్రతను కాపాడడం, రన్‌వేపై తక్షణ భద్రతా చర్యలు చేపట్టేలా ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు స్పందించాలనే ఉద్దేశంతోనే ఈ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.



చిన్నారి అర్చన వైద్యానికి 40 వేల ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్



చిన్నారి అర్చన వైద్యానికి 40 వేల ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్ మిత్ర బృందం

ఉలవపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల అర్చన పరమేశ్వరి (3 సం) మూడు రోజుల క్రితం పాప సృహతప్పి పడిపోవడంతో ఒంగోలు KIMS హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మెదడు వాపు వచ్చిందని, వెంటిలేటర్‌పై చికిత్స అవసరమని తెలిపారు వైద్య ఖర్చులు రూ. 5 నుండి 8 లక్షలు అవుతాయని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పాప తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా  భరించే సామర్థ్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సింగరాయకొండ అప్డేట్స్ చైర్మన్ సాంబ చెన్నంశెట్టి వారి మిత్రులు నరేష్, భరత్, అయ్యప్ప, సూర్య, రవి, బ్రహ్మ మరియు రామి రెడ్డిలు కలిసి, పాప వైద్యానికి రూ. 40,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు చెన్నంశెట్టి సాయి మనోజ్, హరి, రాకేష్ దారుకుమల్లి లు అర్చన తండ్రి దేవండ్ల శివకుమార్ గారికి అందజేశారు.

పాప ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ, తమ వంతు సహాయాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.

#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates
www.fb.com/singarayakondaupdates
singarayakondaupdates.blogspot.com
instagram.com/singarayakondaupdates







APSRTC MD ద్వారకా తిరుమల రావు గారి దృష్టికి సింగరాయకొండ బస్ స్టేషన్ సమస్య.

APSRTC MD ద్వారకా తిరుమల రావు గారి దృష్టికి సింగరాయకొండ బస్ స్టేషన్ సమస్య..

గత కొన్ని సంవత్సరాలుగా సింగరాయకొండ బస్ స్టేషన్ కి సంబంధించి సర్వీస్ లో ఉన్న బస్సులు బస్ స్టేషన్ లోనికి రాకుండా బైపాస్ మీద వెలుతుందడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు APSRTC నెల్లూరు రీజనల్ చైర్మెన్ శ్రీమతి బత్తుల సుప్రజా రెడ్డి గారిని కలిసి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వివరించటం జరిగింది.

సింగరాయకొండ బస్ స్టేషన్ అధికారుల లెక్కల ప్రకారం బస్ స్టేషన్ కి 100 పైగా సర్వీసులు రావల్సి ఉన్నా కూడా ప్రస్తుతం 30 నుండి 40 సర్వీసులు మాత్రమే బస్ స్టేషన్ లోకి వస్తున్నాయని, నెల్లూరు కి మధ్యాహ్నం 1 గంట దాటితే సాయంత్రం 4 వరకు బస్సులు రావట్లేదని, విజయవాడ వెళ్లే ప్రయాణికులు కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.. ఇంకా రాత్రి సమయాల్లో అయితే ఒంగోలు నుంచి లేదా నెల్లూరు నుంచి సింగరాయకొండ చేరుకోవాలంటే ప్రయాణికులు బాధలు వర్ణనాతీతమని తెలిపారు..

ఈ సమస్యలన్నీ సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు లిఖిత పూర్వకంగా అర్జీ రూపంలో శ్రీమతి బత్తుల సుప్రజా రెడ్డి గారికి వివరించి, సింగరాయకొండ బస్ స్టేషన్ కి రావాల్సిన బస్సులన్నీటిని స్టేషన్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, వీటితో పాటు వీలైతే మరికొన్ని కొత్త సర్వీసులను సింగరాయకొండ కు తీసుకురావాలని కోరారు.. అదేవిధంగా సింగరాయకొండ బస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసిన ఎండీ గారికి మరియు సుప్రజా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు..

ఈ విషయమై స్పందించిన సుప్రజా రెడ్డి గారు, ఈరోజు విజయవాడ లోని APSRTC MD, సీనియర్ IPS ఆఫీసర్, గత DGP (RAILWAYS) సీహెచ్ ద్వారక తిరుమల రావు గారినీ కలవటానికి విజయవాడ వెళ్తున్నారని, సింగరాయకొండ బస్ స్టేషన్ సమస్యపై అందజేసిన అర్జీనీ ఎండీ గారికి తప్పకుండా అందజేసి సమస్య నువివరిస్తామని, సింగరాయకొండ బస్ స్టేషన్ కు సర్వీస్ లో ఉన్న బస్సులను నిలుపుదల చేసే విధంగా చర్యలు తప్పకుండా తీసుకుంటామని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు కాకా సాయి తేజ, చెన్నంశెట్టి హరిబాబు, షేక్ మస్తాన్ మరియు మొద్దు బాలాజీ పాల్గొన్నారు.






A.P.S.R.T.C.
Singarayakonda Updates
Singarayakonda Updates 2.0
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com 

బైపాస్ మీద వెళ్లే బస్సులు, బస్ స్టాండ్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోండి : ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కి అర్జీ అందజేసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు

బైపాస్ మీద వెళ్లే బస్సులు, బస్ స్టాండ్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోండి : ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కి అర్జీ అందజేసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు.

గత కొన్ని సంవత్సరాలుగా సింగరాయకొండ బస్ స్టేషన్ కి సంబంధించి సర్వీస్ లో ఉన్న బస్సులు బస్ స్టేషన్ లోనికి రాకుండా బైపాస్ మీద వెలుతుందడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు నేడు సింగరాయకొండ RTC బస్టాండ్ లో పూర్తయిన  ఆదునీకరణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన APSRTC ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, RTC నెల్లూరు జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజ రెడ్డి మరియు డీఎం శ్రీనివాసరావు లకు అర్జీ అందజేశారు.

అధికారుల లెక్కల ప్రకారం బస్ స్టేషన్ కి 100 పైగా సర్వీసులు రావల్సి ఉన్నా కూడా ప్రస్తుతం 30 నుండి 40 సర్వీసులు మాత్రమే బస్ స్టేషన్ లోకి వస్తున్నాయని, నెల్లూరు కి మధ్యాహ్నం 1 గంట దాటితే సాయంత్రం 4 వరకు బస్సులు రావట్లేదని, విజయవాడ వెళ్లే ప్రయాణికులు కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు తెలిపారు. ఇంకా రాత్రి సమయాల్లో అయితే ఒంగోలు నుంచి లేదా నెల్లూరు నుంచి సింగరాయకొండ చేరుకోవాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ విషయమై స్పందించిన చైర్మన్ మరియు డీఎం సర్వీస్ లో ఉన్న బస్సులను నిలుపుదల చేసే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు కూడా ఇదే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో అప్డేట్స్ సభ్యులు కాకా సాయి తేజ, చెన్నంశెట్టి హరిబాబు, షేక్ మస్తాన్, రాకేష్ దారుకుమల్లి పాల్గొన్నారు.






A.P.S.R.T.C.
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates