బైపాస్ మీద వెళ్లే బస్సులు, బస్ స్టాండ్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోండి : ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కి అర్జీ అందజేసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు.
గత కొన్ని సంవత్సరాలుగా సింగరాయకొండ బస్ స్టేషన్ కి సంబంధించి సర్వీస్ లో ఉన్న బస్సులు బస్ స్టేషన్ లోనికి రాకుండా బైపాస్ మీద వెలుతుందడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు నేడు సింగరాయకొండ RTC బస్టాండ్ లో పూర్తయిన ఆదునీకరణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన APSRTC ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, RTC నెల్లూరు జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజ రెడ్డి మరియు డీఎం శ్రీనివాసరావు లకు అర్జీ అందజేశారు.
అధికారుల లెక్కల ప్రకారం బస్ స్టేషన్ కి 100 పైగా సర్వీసులు రావల్సి ఉన్నా కూడా ప్రస్తుతం 30 నుండి 40 సర్వీసులు మాత్రమే బస్ స్టేషన్ లోకి వస్తున్నాయని, నెల్లూరు కి మధ్యాహ్నం 1 గంట దాటితే సాయంత్రం 4 వరకు బస్సులు రావట్లేదని, విజయవాడ వెళ్లే ప్రయాణికులు కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు తెలిపారు. ఇంకా రాత్రి సమయాల్లో అయితే ఒంగోలు నుంచి లేదా నెల్లూరు నుంచి సింగరాయకొండ చేరుకోవాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ విషయమై స్పందించిన చైర్మన్ మరియు డీఎం సర్వీస్ లో ఉన్న బస్సులను నిలుపుదల చేసే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు కూడా ఇదే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో అప్డేట్స్ సభ్యులు కాకా సాయి తేజ, చెన్నంశెట్టి హరిబాబు, షేక్ మస్తాన్, రాకేష్ దారుకుమల్లి పాల్గొన్నారు.
A.P.S.R.T.C.
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates



No comments:
Post a Comment