APSRTC MD ద్వారకా తిరుమల రావు గారి దృష్టికి సింగరాయకొండ బస్ స్టేషన్ సమస్య..
గత కొన్ని సంవత్సరాలుగా సింగరాయకొండ బస్ స్టేషన్ కి సంబంధించి సర్వీస్ లో ఉన్న బస్సులు బస్ స్టేషన్ లోనికి రాకుండా బైపాస్ మీద వెలుతుందడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు APSRTC నెల్లూరు రీజనల్ చైర్మెన్ శ్రీమతి బత్తుల సుప్రజా రెడ్డి గారిని కలిసి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వివరించటం జరిగింది.
సింగరాయకొండ బస్ స్టేషన్ అధికారుల లెక్కల ప్రకారం బస్ స్టేషన్ కి 100 పైగా సర్వీసులు రావల్సి ఉన్నా కూడా ప్రస్తుతం 30 నుండి 40 సర్వీసులు మాత్రమే బస్ స్టేషన్ లోకి వస్తున్నాయని, నెల్లూరు కి మధ్యాహ్నం 1 గంట దాటితే సాయంత్రం 4 వరకు బస్సులు రావట్లేదని, విజయవాడ వెళ్లే ప్రయాణికులు కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.. ఇంకా రాత్రి సమయాల్లో అయితే ఒంగోలు నుంచి లేదా నెల్లూరు నుంచి సింగరాయకొండ చేరుకోవాలంటే ప్రయాణికులు బాధలు వర్ణనాతీతమని తెలిపారు..
ఈ సమస్యలన్నీ సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు లిఖిత పూర్వకంగా అర్జీ రూపంలో శ్రీమతి బత్తుల సుప్రజా రెడ్డి గారికి వివరించి, సింగరాయకొండ బస్ స్టేషన్ కి రావాల్సిన బస్సులన్నీటిని స్టేషన్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, వీటితో పాటు వీలైతే మరికొన్ని కొత్త సర్వీసులను సింగరాయకొండ కు తీసుకురావాలని కోరారు.. అదేవిధంగా సింగరాయకొండ బస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసిన ఎండీ గారికి మరియు సుప్రజా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు..
ఈ విషయమై స్పందించిన సుప్రజా రెడ్డి గారు, ఈరోజు విజయవాడ లోని APSRTC MD, సీనియర్ IPS ఆఫీసర్, గత DGP (RAILWAYS) సీహెచ్ ద్వారక తిరుమల రావు గారినీ కలవటానికి విజయవాడ వెళ్తున్నారని, సింగరాయకొండ బస్ స్టేషన్ సమస్యపై అందజేసిన అర్జీనీ ఎండీ గారికి తప్పకుండా అందజేసి సమస్య నువివరిస్తామని, సింగరాయకొండ బస్ స్టేషన్ కు సర్వీస్ లో ఉన్న బస్సులను నిలుపుదల చేసే విధంగా చర్యలు తప్పకుండా తీసుకుంటామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు కాకా సాయి తేజ, చెన్నంశెట్టి హరిబాబు, షేక్ మస్తాన్ మరియు మొద్దు బాలాజీ పాల్గొన్నారు.
A.P.S.R.T.C.
Singarayakonda Updates
Singarayakonda Updates 2.0
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com



No comments:
Post a Comment