Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

సింగరాయకొండలో కొత్త ట్రైన్స్ నిలుపుదల చేయండి. మంత్రిని కలిసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు

సింగరాయకొండలో కొత్త ట్రైన్స్ నిలుపుదల చేయండి. మంత్రిని కలిసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు.

సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి కొత్త ట్రైన్స్ నిలుపుదల చేయాలని నేడు నాయుడుపాలెంలోని వారి స్వగృహంలో సాంఘిక సంక్షేమం & సాధికారత, దివ్యాంగుల, వృద్ధులు సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్ల శాఖమాత్యులు మరియు కొండపి ఎమ్మెల్యే శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

1. నవజీవన్ SF EXPRESS అహ్మదాబాద్ - చెన్నై 
2. జన్ శతాబ్ది SF EXPRESS విజయవాడ - చెన్నై 
3. హౌరా Express హౌరా - SMTV బెంగళూరు
4. నర్సాపూర్ Express నర్సాపూర్ - ధర్మవరం

ఈ ట్రైన్స్ కు సంబంధించి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు పెమ్మసాని చంద్రశేఖర్ లకు తెలియజేసి సింగరాయకొండ కి స్టాపింగ్ ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి విజయవాడలో వారితో మాట్లాడి ఆపించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో టిడిపి నాయకులు కూనపురెడ్డి సుబ్బారావు, సింగరాయకొండ వార్డ్ మెంబర్ పడిదపు రవికుమార్ మరియు అప్డేట్స్ సభ్యులు కాక సాయి తేజ,  హరి చెన్నంశెట్టి ఉన్నారు.




Singarayakonda Updates 
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates 

No comments:

Post a Comment