Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

ఆధునిక కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి పిల్లి హాజరత్తయ్య


అవార్డు గ్రహీతను సన్మానించిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు..
కవి, పాకల జిల్లా పరిషత్ స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీ పిల్లి హజరత్తయ్య గారికి ఇటీవల
మహా కవి గుర్రం జాషువా పురస్కారం - 2023 (సాహిత్య భూషణ్) ను ప్రధానం చేసారు..
అందులో భాగంగా హజరత్తయ్య గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు మరియు ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపకులు అయిన దాచూరి రామిరెడ్డి గారి వర్ధంతి నాడు వారినీ గుర్తు చేసుకుంటూ, హజరత్తయ్య లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించడం తమకు దక్కిన గౌరవం అని సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు తెలిపారు.. వ్యాయామ ఉపాధ్యాయుదిగా విద్యార్థులను ఆటలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దితూ, సాహితీ రంగములో అనేక రచనలు చేసి 500 లకు పైగా కవితలు, 50కి పైగా వ్యాసములు వ్రాసి అనేక ఘన సన్మానములు, పురస్కారములు పొందిన హజరత్తయ్య లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం అని కొనియాడారు..
మునుముందు కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమాలను కొనసాగిస్తూ, మహనీయుల త్యాగాలను మరుమమని సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ సవిడిబోయిన, భరత్ అడుసుమల్లి, హరి చెన్నoశెట్టి మరియు సభ్యులు పాల్గొన్నారు..
Hajarathaiah Pilli గారు - 🙏🙏👏👏

No comments:

Post a Comment