-- సింగరాయకొండ సర్పంచ్ గా చరిత్ర ఎరుగని విజయాన్ని కైవసం..
-- రాష్ట్రంలోనే అత్యధిక రెండవ మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్..
-- అడ్మినిస్ట్రేషన్, మనీ మేనేజ్మెంట్ లో అందరికంటే ముందు..
-- ప్రజలకి అందుబాటులో ఉండటంలో వెనుకంజ.. నెలకి 2 లేదా 3 సార్లు మాత్రమే అందుబాటు..
-- మధ్యవర్తుల ద్వారా పరిపాలన, సమస్యలు ఎవరితో తెలియజేయాలని సింగరాయకొండ పంచాయతీ ప్రజలు అయోమయం..
సింగరాయకొండ మండలంలో లో వైసీపీ పార్టీ తరపున ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే తాటిపర్తి కుటుంబం నుంచి విద్యావేత్త తాటిపర్తి వనజ గారు 2021 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయగా సింగరాయకొండ పంచాయతీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. 5000 పైబడి మెజారిటీ సాధించి జిల్లాలో ప్రథమం మరియు రాష్ట్రంలో 2 వ అత్యధిక గెలుపు సాధించి చరిత్ర సృష్టించారు..
గెలిచిన నాటినుండి పంచాయతీలో మంచి మార్పులు తీసుకొస్తూనే పంచాయతీలో జరిగే ఏ పనికైనా ప్రజల వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేయడంతో పాటు, మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు.. పంచాయతీకి వచ్చిన ప్రతిసారి అధికారులతో స్టాఫ్ మీటింగ్ పెడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా పరిపాలన అందించాలనేది ముఖ్య ఉద్దేశం గా చెప్తూ ఉంటారు..
వ్యాపార పరంగా కుటుంబం హైదరాబాదులో స్థిరపడిన పంచాయతీ సర్పంచిగా గెలుపొందిన తర్వాత నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటారని సింగరాయకొండ పంచాయితీ ప్రజలు ఆశించారు.. కానీ దానికి విభిన్నంగా నెలకి 2 లేదా 3 సార్లు మాత్రమే పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మధ్యవర్తుల చేత సింగరాయకొండల పంచాయితీలో పరిపాలన చేపిస్తూ ప్రజా సమస్యలను తీరుస్తున్నారు.. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు సింగరాయకొండ పంచాయితీ ఆఫీసులో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటుచేసిన, ప్రజలు వారికున్న సమస్యలను ఆ విధంగా ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపకపోగా, గెలిపించిన వారికి తమ సమస్యలను విన్నవించుకుంటే వారి సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు..
మూలగుంటపాడు సర్పంచ్ డాక్టర్ బత్తుల శివరామిరెడ్డి గారు ఆదర్శం..
8 పదుల వయసులో కూడా, ప్రజలకు సేవ చేయాలనే తపనతో మూలగుంటపాడు సర్పంచిగా ఎన్నికైన శివరామిరెడ్డి గారు వారానికి 2, 3 రోజులు మూలగుంటపాడు పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి ఇంటి దగ్గర నుంచి కూడా నిత్యం ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తు, వారి సమస్యలను పరిష్కరిస్తున్న డాక్టర్ బత్తుల శివరామిరెడ్డి గారిని సింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజ ఆదర్శంగా తీసుకోవాలని సింగరాయకొండ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు..
సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉన్న, రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సేవా కార్యక్రమాలతో పాటుగా, ప్రజల చేత ఎన్నికైన పదవులలో కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటేనే, భవిష్యత్తులో మంచి నాయకులుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, లేదంటే పార్ట్ టైం పొలిటీషియన్స్ గా మిగిలిపోతారని సింగరాయకొండ పంచాయితీ ప్రజలు అనుకుంటున్నారు..

మంచి చైర్మన్ గారు త్వరలో సరిచేసుకుంటారు
ReplyDelete